మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావుకి షోకాజ్ నోటీసులు

ABN , First Publish Date - 2022-01-29T21:29:02+05:30 IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ నేత, మాజీ ఎమ్మెల్సీ

మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావుకి షోకాజ్ నోటీసులు

హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావుకి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు చేసింది. సీనియర్ నాయకడు వి. హనుమంతరావుపై మంచిర్యాల పర్యటనలో జరగిన దాడి ఘటనపై క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ప్రేం సాగర్‌కు టీ కాంగ్రెస్ క‌మిటీ క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం చైర్మ‌న్ చిన్నారెడ్డి నోటీసులు జారీ చేశారు. తనపై దాడి చేసినా చర్యలు తీసుకోవడం లేదని టీపీసీసపై వి.హెచ్ ఆగ్రహం చెందారు. దీంతో మూడు నెలల తరువాత అధిష్ఠానం  చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. 



కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా చైతన్యయాత్రలో ప్రేంసాగర్‌రావు వర్గీయులు వీహెచ్‌ కారును అడ్డుకున్న సంగతి తెలిసిందే. కారులో నుంచి కిందకు దిగకుండా చుట్టుముట్టారు. డీసీసీ అధ్యక్షురాలు ఆదేశాల మేరకు తాము నిరసన తెలుపుతున్నామని, ఆమెకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జనక్‌ ప్రసాద్‌తో కలిసి ఎలా హాజరవుతారని వీహెచ్‌తో వాదనకు దిగారు. వీహెచ్‌ అంటే తమకు వ్యతిరేకం కాదని, ఏనాడు పార్టీ కార్యక్రమాలలో పాలుపంచుకోని వాళ్లతో కలిసి రావడంతోనే తాము అభ్యంతరం చెబుతున్నామన్నారు. వీహెచ్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. 

Updated Date - 2022-01-29T21:29:02+05:30 IST