Advertisement
Advertisement
Abn logo
Advertisement

అప్‌ స్కిల్లింగ్‌కు కొత్త యాప్‌ ‘షోరీల్‌’

నిరుద్యోగులకు అవకాశాలకు తోడు నైపుణ్యాల పెంపునకు ఉద్దేశించిన యాప్‌ ‘షోరీల్‌’ ఆరంభమైంది. హాట్‌మెయిల్‌ కో ఫౌండర్‌ సబీర్‌ భాటియా దీన్ని తీసుకువచ్చారు. మెంటార్లు లేదంటే హైరింగ్‌ కంపెనీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రొఫెషనల్‌ వీడియోలను ఉద్యోగార్థులు ఈ యాప్‌తో రూపొందిచుకోవచ్చు. అలా వచ్చిన రెస్పాన్స్‌లను షోరీల్‌ ఒక దగ్గరకు కలుపుతుంది.  తతిమా ఉద్యోగార్థులు నేర్చుకునేందుకు, తమకు తాము మరింత నైపుణ్యం పెంచుకునేందుకు ఈ వీడియోలు ఉపయోగపడతాయి. పర్సనల్‌, ప్రొఫెషనల్‌, లీడర్‌షిప్‌, ఎంట్రప్రెనూరియల్‌పరంగా నిరుద్యోగుల ఎదుగుదలకు దోహదపడతాయి.  రిక్రూటింగ్‌ కంపెనీలతో కలసి హైరింగ్‌ సవాళ్ళను చేఽధించే యత్నంలో ప్రస్తుతం ఈ కంపెనీ ఉంది. నిరుద్యోగులకు ఉపయోగపడేలా షోరీల్స్‌ సైతం కొన్ని ప్రొఫెషనల్‌ వీడియో్‌సను రూపొందించనుంది.  ప్లేస్టోర్‌(ఐఓఎస్‌), గూగుల్‌ ప్లే(ఆండ్రాయిడ్‌)లో ఇది అందుబాటులో ఉంది.


సబీర్‌ భాటియా 90ల్లో టెక్నాలజీ పోస్టర్‌ బాయ్‌గా ప్రసిద్ధి చెందారు. 1996లోనే తన ‘హాట్‌మెయిల్‌’ను మైక్రోసా్‌ఫ్టకు 400 మిలియన్‌ డాలర్లుకు అమ్మేశారు.  లైవ్‌ చర్చలతో నిరుద్యోగులకు మరింత దగ్గరయ్యే యత్నంలో ఉన్నట్టు భాటియా ఈ సందర్భంలో వెల్లడించారు. సేకరించిన డేటాను ఎఐతో విశ్లేషించి తీసుకోదగ్గ చర్యలను ఆడియెన్స్‌కు వివరిస్తామని కూడా ఆయన చెప్పారు.

Advertisement
Advertisement