Abn logo
Aug 14 2020 @ 16:00PM

వెండితెరపై నగ్నంగా `సాహో` భామ?

తమిళంలో హీరోయిన్ అమలాపాల్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం `ఆడై` (తెలుగులో `ఆమె`). ఈ సినిమాలో అమల నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ సినిమాలో అమల నగ్నంగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో హిందీలోకి రీమేక్ కాబోతోందట. 


ప్రభాస్ సరసన `సాహో` సినిమాలో నటించిన శ్రద్ధా కపూర్ ఈ హిందీ రీమేక్‌లో నటించనుందట. మాతృకను రూపొందించిన దర్శకుడు రత్నకుమార్ హిందీ వెర్షన్‌ను కూడా డైరక్ట్ చేయబోతున్నాడట. ఈ సినిమాలో శ్రద్ధ కూడా అమల స్థాయిలోనే బోల్డ్‌గా, న్యూడ్‌గా కనిపించనుందట. `ఆడై` హిందీ రీమేక్‌లో కంగన నటించబోతున్నట్టు ఆ మధ్య వార్తలు వినిపించాయి. చివరకు ఈ పాత్ర శ్రద్ధను వరించిందట. 

Advertisement
Advertisement
Advertisement