Abn logo
Feb 27 2020 @ 22:21PM

మళ్లీ ఆ తప్పు చేయనంటున్న ప్రభాస్ హీరోయిన్

ఈ మాట అంది ఎవరో కాదు ‘సాహో’ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌. అయితే ఆమె అన్న మాటల్లో విపరీతార్థం ఏమీ లేదు. ఇక సౌత్‌ సినిమాల్లో నటించకూడదని డిసైడ్‌ అయ్యిందట. ఎంతో ఆశతో చేసిన ‘సాహో’ కుదేలయ్యేటప్పటికీ ఇక మీదట దక్షిణాది సినిమాల్లో చేయకూడదని నిర్ణయించుకుందట. ఇటీవల టాలీవుడ్‌ నుంచి దర్శకనిర్మాతలు ఆమెకు కథ చెప్పడానికి ప్రయత్నిస్తే ఒకసారి తెలుగులో సినిమా చేసి తప్పు చేసాను. మరోసారి ఆ తప్పు చేయను అంటూ చెప్పిందట. సినిమా ఆడకపోవడానికి చాలా కారణాలుంటాయి. దానికి టాలీవుడ్‌ని నిందించడమెందుకంటున్నారు సినీ జనాలు. మంచి కథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారన్న సంగతి తెలిసిందే కదా. 

Advertisement
Advertisement
Advertisement