భక్తిశ్రద్ధలతో శ్రావణ శుక్రవారం పూజలు

ABN , First Publish Date - 2022-08-27T04:34:35+05:30 IST

శ్రావణమాసం చివరి శుక్రవారం పట్టణంలోని పలు ఆలయాల్లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో శ్రావణ శుక్రవారం పూజలు
దయానంద విద్యామందిర్‌లో కుంకుమార్చన చేస్తున్న మహిళలు, సుగంధం వేర్లతో వాసవీ మాతకు అలంకరణ

- ఆలయాల్లో ప్రత్యేక పూజలు

- సుగంధం వేర్లతో వాసవీ మాతకు అలంకరణ 

- మహిళల సామూహిక కుంకుమార్చనలు

గద్వాల టౌన్‌, ఆగస్టు 26 : శ్రావణమాసం చివరి శుక్రవారం పట్టణంలోని పలు ఆలయాల్లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.  వాసవీ కన్యకా పరమేశ్వరి, భద్రకాళి వీరభద్రేశ్వర, కాళికా దేవి, అంబాభవానీ, పాతహౌసింగ్‌ బోర్డు కాలనీ లోని అన్నపూర్ణ ఆలయాల్లో మహిళలు పూజలు నిర్వహించారు. దయానంద విద్యామందిర్‌లో నెల రోజుల పాటు హోమాలు కొనసాగాయి. చివరి శుక్రవారం కౌన్సిలర్లు శ్రీమన్నారాయణ, రజక జయశ్రీ దంపతుల ఆధ్వర్యంలో సామూహిక హోమాలు నిర్వహించారు. మొత్తం 26 జంటలతో ప్రత్యేక హోమం నిర్వహించామని, హిందూధర్మ ప్రచారకురాలు రావికంటి జ్యోతి తెలిపారు. వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారిని సుగంధ (వట్టివేర్లు) వేర్లతో ప్రత్యేకంగా అలంకరించి సామూహిక కుంకుమార్చన చేశారు. కాళికాదేవి, అన్నపూర్ణదేవి ఆలయాల్లోనూ మహిళలు అమ్మవారికి కుంకుమార్చన చేశారు. 


Updated Date - 2022-08-27T04:34:35+05:30 IST