ఉమామహేశ్వర క్షేత్రంలో శ్రావణమాసం పూజలు

ABN , First Publish Date - 2022-08-02T06:47:24+05:30 IST

ఉమామహేశ్వరం క్షేత్రంలో శ్రావణమాసం తొలి సోమవా రం సందర్బంగా భక్తులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ఈశ్వరుడిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

ఉమామహేశ్వర క్షేత్రంలో శ్రావణమాసం పూజలు
అమ్మవారిని పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళుతున్న భక్తులు

   అచ్చంపేటఅర్బన్‌, ఆగస్టు 1: ఉమామహేశ్వరం క్షేత్రంలో  శ్రావణమాసం తొలి సోమవా రం సందర్బంగా భక్తులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు  ఈశ్వరుడిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. పాపనాశిని గుండంలో పుణ్య స్నానాలు చేసి క్షీరాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, గణపత్రి, అయ్యప్పు స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు, కమిటీ చైర్మన్‌ కందూరు సుధాకర్‌ భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం అమ్మవారిని ఆలయం నుంచి పాపనాశిని గుండం వరకు పల్లకిలో భజన సంకీర్తణతో అర్చకుల వేద మంత్రాల మధ్య ఊరేగింపుగా పల్లకీలో తీసుకెళ్లారు. ఆలయంలో  భక్తులకు  అన్నదానం నిర్వహించారు. ఆలయ అర్చకులు వీరయ్య, నీలకఠం సిబ్బంది రామకృష్ణ, పర్వతాలు లక్ష్మయ్య, కవి తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-08-02T06:47:24+05:30 IST