మిస్ వరల్డ్ అమెరికాగా ఇండియన్ అమెరికన్ శ్రీ సైనీ

ABN , First Publish Date - 2021-10-08T06:45:20+05:30 IST

ఇండియన్ అమెరికన్ శ్రీ సైని మిస్ వరల్డ్ అమెరికా 2021 విజేతగా నిలిచారు. వివరాలను మిస్ వరల్డ్ అమెరికా వెబ్‌సైట్‌లో మంగళవారం ప్రకటించారు. పంజాబ్‌లో జన్మించిన సైనీ.. ఈ అవార్డు గెలుచుకున్న తొలి ఇండియన్ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. సైనీ పంజాబ్‌లో జన్మించారు. సైనీ జీవితంలో ఎన్నో కష్టనష్టాలున్నాయి. ఆమె చిన్నతనంలోనే కార్ యాక్సిడెంట్‌కు గురై ముఖం మొత్తం కాలిపోయింది. అయినా ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. చిన్న వయసులోనే హృదయం సంబంధ వ్యాధితో బాధపడ్డారు. ఈ క్రమంలోనే ఆమె గుండెకు వైద్యులు పేస్ మేకర్ అమర్చారు.

మిస్ వరల్డ్ అమెరికాగా ఇండియన్ అమెరికన్ శ్రీ సైనీ

వాషింగ్టన్: ఇండియన్ అమెరికన్ శ్రీ సైని మిస్ వరల్డ్ అమెరికా 2021 విజేతగా నిలిచారు. వివరాలను మిస్ వరల్డ్ అమెరికా వెబ్‌సైట్‌లో మంగళవారం ప్రకటించారు. పంజాబ్‌లో జన్మించిన సైనీ.. ఈ అవార్డు గెలుచుకున్న తొలి ఇండియన్ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. సైనీ పంజాబ్‌లో జన్మించారు.  సైనీ జీవితంలో ఎన్నో కష్టనష్టాలున్నాయి. ఆమె చిన్నతనంలోనే కార్ యాక్సిడెంట్‌కు గురై ముఖం మొత్తం కాలిపోయింది. అయినా ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. చిన్న వయసులోనే హృదయం సంబంధ వ్యాధితో బాధపడ్డారు. ఈ క్రమంలోనే ఆమె గుండెకు వైద్యులు పేస్ మేకర్ అమర్చారు. ఇప్పటికీ ఆమె పేస్‌మేకర్‌తోనే జీవిస్తున్నారు. తాను పడుతున్న బాధలతోనే జీవితం విలువేంటో తెలుసుకున్న సైనీ.. ఎంతోమందికి అండగా నిలబడుతున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ ముందుకెళుతున్నారు.


ఇక మిస్ వరల్డ్ అమెరికాగా ఎంపికైన వెంటనే సైనీ.. తన ఇన్‌‌‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ విజయం తనది మాత్రమే కాదని, తాను ఈ స్థాయికి చేరుకోవడానికి చేయూతనందించిన వారందరిదీ అంటూ వినయంగా పేర్కొన్నారు. తన జీవిత పయనంలో తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరు, తనను ప్రొత్సహించిన వారు, తప్పటడుగు వేస్తున్నప్పుడు సరిచేసిన వారందరినీ ఈ విజయమని పేర్కొన్నారు.

Updated Date - 2021-10-08T06:45:20+05:30 IST