Abn logo
Jan 16 2021 @ 23:57PM

కామారెడ్డిలో శ్రీరామ సంకీర్తన శోభాయాత్ర

కామారెడ్డి/కామారెడ్డి టౌన్‌, జనవరి 16: కామారెడ్డి జిల్లా కేంద్రం లో శనివారం ఉదయం 10 గంటలకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీరామ నామ సంకీర్తన శోభాయా త్ర వైభవంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్‌ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పట్టణంలోని ప్రధాన రహదారులగుండా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సోమాయప్ప స్వామిజీ హాజరై మాట్లాడారు. తరతరాల నుంచి కళలు కన్న భవ్యరామమందిర నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ప్రతీ హిందూ బంధువు దగ్గరకి రామభక్తులు వెళ్లి నిధి సేకరించడం ఆనం దదాయకమన్నారు. అనంతరం మంత్రోచ్ఛరణల తర్వాత జెండా ఊపి శోభాయాత్ర ర్యాలీని ప్రారంభించారు. కాగా ఈ ర్యాలీలో పార్టిలకతీత ంగా నాయకులు, కార్యకర్తలతో పాటు దాదాపు 3వేల మంది పాల్గొన గా 7 కిలోమీటర్ల మేర భారీ శోభాయాత్రను నిర్వహించారు. ఈ ర్యాలీ లో చిన్నారులు, శ్రీరాముడు, సీత, లక్ష్మణ్‌, హనుమంతుడు వేషధారణ లో అందరిని అలరించగా, మరికొంత మంది ప్రత్యేక కోలాటాలు నృత్యాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. తాడ్వాయి మండలం సంగోజి వాడి, సదాశివనగర్‌ మండలం లింగంపల్లి నుంచి వచ్చిన కళాకారులు ప్రత్యేక కోలాటాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కొత్త బస్టాండ్‌ మీదుగా నిజాంసాగర్‌ చౌరస్తా, కమాన్‌రోడ్డు, స్టేషన్‌రోడ్డు, సుభాష్‌ రోడ్డు, జేపీఎన్‌ చౌరస్తా నుంచి సిరిసిల్లా రోడ్డు మీదుగా పాత బస్టాం డ్‌ అడ్లూర్‌ రోడ్డు, అశోక్‌నగర్‌ మీదుగా తిరిగి శిశుమందిర్‌కు ర్యాలీ చేరుకుంది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం సరస్వతీ శిశుమందిర్‌లో ర్యాలీలో పాల్గొన్న వారికి భోజనాలు ఏర్పాటు చేశారు.
తాడ్వాయిలో ర్యాలీ
తాడ్వాయి: మండల కేంద్రంలో శనివారం శ్రీరామ జన్మభూమి తీర్థట్రస్టు ఆధ్వర్యంలో ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్‌ నుంచి కొత్తబస్టాండ్‌ వరకు ఎల్లారెడ్డి-కామారెడ్డి రోడ్డుపై గ్రామంలోని ప్రధానవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముడి మందిరానికి హిం దూ బంధువులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతి నిధులు యాదగిరి, రమాశంకర్‌, అనిల్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీబీపేటలో ప్రచార రథం ప్రారంభం
బీబీపేట: శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిధి సేక రణ ప్రచార రథాన్ని బీబీపేట మండల కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌ సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలో రామమ ందిర నిర్మాణంలో హిందువులందరిని భాగస్వామ్యులు కావాలనే ఉద్దే శ్యంతో నిఽధి సమర్పణ అభియాన్‌లో భాగంగా ఈనెల 20 నుంచి నిధి సేకరణ ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా ఆదివారం శ్రీరామ నామ సంకీర్తన శోభాయాత్ర నిర్వహిస్తామని తెలిపారు.  
నేడు నస్రుల్లాబాద్‌లో బైక్‌ ర్యాలీ
నస్రుల్లాబాద్‌: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి హిందూ బంధువులంతా ముందుకు వచ్చి నిధి సేకరణకు సహకరించాలని నస్రుల్లాబాద్‌ మండలంలోని యువకులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలోని రామాలయం నుంచి బైక్‌ ర్యాలీ ప్రారంభవుతుందన్నారు. నస్రుల్లాబాద్‌, బొప్పాస్‌పల్లి, బైరాపూర్‌, బరంగ్‌ఎడ్గి, బీర్కూర్‌, కిష్టాపూర్‌, చించొల్లి, అన్నారం, దామరంచ, రైతునగర్‌, మిర్జాపూర్‌, వీరాపూర్‌, దుర్కి, అంకోల్‌ క్యాంపు, అంకోల్‌, అంకోల్‌ తండా, సంగెం, హాజీపూర్‌, బొమ్మన్‌దేవ్‌పల్లి, నెమ్లి, నాచుపల్లి, రాముల గుట్ట తండా, మైలారం మీదుగా ర్యాలీ కొనసాగి, తిరిగి నస్రుల్లాబాద్‌ మండల కేంద్రానికి చేరుకుంటుందన్నారు. బైక్‌ ర్యాలీలో హిందూ సోదరులు, అన్ని గ్రామాల యువకులు, పెద్ద ఎత్తు న పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
Advertisement