రొయ్య.. రెండున్నర కిలోలు!

ABN , First Publish Date - 2021-01-18T08:49:32+05:30 IST

ఒక్కో రొయ్య సాధారణంగా ఐదు, పది గ్రాములుంటుంది. గొప్పగా చెప్పుకునే టైగర్‌ రొయ్య సైతం 30-50 గ్రాముల్లోపే ఉంటుంది. కిలోకి 30 వరకు తూగుతాయి.

రొయ్య.. రెండున్నర కిలోలు!

క్కో రొయ్య సాధారణంగా ఐదు, పది గ్రాములుంటుంది. గొప్పగా చెప్పుకునే టైగర్‌ రొయ్య సైతం 30-50 గ్రాముల్లోపే ఉంటుంది. కిలోకి 30 వరకు తూగుతాయి. ఒక్కటే కిలో వరకు తూగే బ్లాక్‌ టైగర్‌ రొయ్యలు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇదిగో.. ఇది అంతకంటే అరుదైన రొయ్య. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళేనికి చెందిన కొమారి రాము ఆదివారం సముద్రంలో చేపల వేట సాగిస్తుండగా, ఆయన వలకు రెండున్నర కిలోల రొయ్య చిక్కింది. రూ.1500లకు బహిరంగ మార్కెట్‌లో అమ్మాడు. భారీ సైజులో ఉన్న ఆ రొయ్యను స్థానికులు ఆసక్తిగా తిలకించారు.       

 -విడవలూరు

Updated Date - 2021-01-18T08:49:32+05:30 IST