కుంచించుకుపోతున్నవిమాన సేవలు?

ABN , First Publish Date - 2020-02-22T07:51:08+05:30 IST

తాజాగా విశాఖ విమానాశ్రయం నుండి రెండు విమాన సేవలు రద్దు అవుతున్నాయన్న వార్త విశాఖ వాసులను తీవ్ర నిరాశ,నిస్పృహలకు గురిచేస్తున్నది..

కుంచించుకుపోతున్నవిమాన సేవలు?

తాజాగా విశాఖ విమానాశ్రయం నుండి రెండు విమాన సేవలు రద్దు అవుతున్నాయన్న వార్త విశాఖ వాసులను తీవ్ర నిరాశ,నిస్పృహలకు గురిచేస్తున్నది.గత సంవత్సర కాలంలో క్రమ క్రమమగా విమానాల రాకపోకలు తగ్గిపోతున్నాయి.విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినా విమాన సర్వీసులు తగ్గిపోవటం ఆశ్ఛర్యంగా ఉంది. గత ఏడాది కాలంగా విశాఖలో రోజు రోజుకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.ఇలా అభివృద్ధి తిరోగమనంలో ఉంటే యువతకు ఉపాధి లేక వలసలు పోవాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి.పాలకుల వివాదాస్పద, హేతుబద్ధతలేని పోకడలతో రాష్ట్రానికి పెట్టుబడులు రాని వాతావరణం సృష్టించారు.కేంద్రం నుండి నిధులు రాబట్టటంలోనూ పూర్తిగా వైఫల్యం చెందారు.ఇది ముమ్మాటికీ రాష్ట్ర పాలకుల తప్పే!

కంభంపాటి కోటేశ్వర రావు

విశాఖపట్నం

Updated Date - 2020-02-22T07:51:08+05:30 IST