Abn logo
Jan 20 2021 @ 13:52PM

అలాంటి పాత్రలకు వెనుకాడను: శృతి హాసన్‌

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ కుమార్తెగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అందాల బొమ్మ శృతి హాసన్‌. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయికగా రాణిస్తోంది. అయితే, ఏ ఒక్క భాషలోనూ ఆమె పూర్తి స్థాయిలో నిలదొక్కుకోలేకపోతోంది. ఫలితంగా ఆమెకు అవకాశాలు కూడా మృగ్యమయ్యాయి. 2017 తర్వాత వచ్చిన ‘సి-3’ చిత్రం తర్వాత ఒక్కటంటే ఒక్క తమిళ చిత్రం కూడా లేకపోవడం గమనార్హం. అదేవిధంగా తెలుగులోనూ 2017 తర్వాత ఈ సంక్రాంతికి విడుదలైన 'క్రాక్‌'తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రంలో శృతి హాసన్‌ ఓ బిడ్డకు తల్లిగా నటించింది. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ హీరోయిన్‌ తల్లిపాత్ర చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలకు శృతి హాసన్‌ ధీటుగానే సమాధానమిచ్చింది.


కథ డిమాండ్‌ చేస్తే ఖచ్చితంగా తల్లిపాత్రల్లో నటిస్తానని స్పష్టం చేసింది. ముఖ్యంగా, తల్లి పాత్రల్లో నటించడం వల్ల హీరోయిన్‌ కెరీర్‌కి ఎలాంటి ఆటంకాలు రావని తాను భావిస్తున్నట్టు తెలిపింది. తాను ధరించే పాత్ర కీలకంగా ఉండటంతో పాటు కథతో అనుసంధానమై ఉంటే మున్ముందు కూడా అమ్మ పాత్రల్లో నటిస్తానని, ఈ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని శృతి హాసన్‌ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement
Advertisement