Abn logo
Nov 21 2020 @ 22:01PM

తుఫాన్‌కి ముందు.. శృతిహాసన్‌ వీడియో వైరల్‌

Kaakateeya

స్టార్‌ హీరోయిన్‌ శృతిహాసన్‌ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌. హీరోయిన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌, సింగర్‌.. ఇలా పలు పాత్రలు పోషిస్తూ.. ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. లోకనాయకుడు కమల్‌ హాసన్‌ తనయ అయినప్పటికీ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని శృతిహాసన్‌ క్రియేట్‌ చేసుకుంది. అయితే ఆ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన శృతిహాసన్‌ మళ్లీ.. ఇప్పుడు హీరోయిన్‌గా బిజీ అవుతోంది. తాజాగా ఆమె రవితేజతో క్రాక్‌ చిత్రంలో చేస్తోంది. అటు సినిమాలు చేసుకుంటూనే.. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. మ్యూజిక్‌ వీడియోలను పెడుతూ ఉంటుంది. తాజాగా ఆమె మ్యూజిక్‌ ప్లే చేస్తోన్న వీడియోని తన ఇన్‌స్టాగ్రమ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోతో పాటు 'ఈ రోజు నేను స్వరపరిచిన సంగీతం‌.. తుఫాన్‌కి ముందు ఉండే ప్రశాంతత.. చేయడానికి చాలా ఉంది..'' అంటూ శృతి పేర్కొంది.


Advertisement
Advertisement