Advertisement
Advertisement
Abn logo
Advertisement

షువాయ్‌ వివాదం.. చైనాలో టెన్నిస్‌ టోర్నీలపై నిషేధం

బీజింగ్‌: చైనా టెన్నిస్‌ డబుల్స్‌ స్టార్‌ ఫెంగ్‌ షువాయ్‌ అదృశ్యంపై ప్రపంచ మహిళల టెన్నిస్‌ సమాఖ్య (డబ్ల్యూటీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిగా చైనాలో జరగాల్సిన అన్ని డబ్ల్యూటీఏ టోర్నీలను సస్పెండ్‌ చేసింది. అయితే, డబ్ల్యూటీఏ చర్య..  క్రీడలను రాజకీయం చేసే కార్యక్రమని చైనా మండిపడింది. దేశానికి చెందిన ఓ కీలకనేత తనను లైంగికంగా వేధించాడని షువాయ్‌ సోషల్‌ మీడియాలో ఆరోపణలు చేసినప్పటి నుంచి ఆమె బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటోంది. పెంగ్‌ ఆచూకీ చెప్పాలని అనేక మంది డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీఏ సీఈవో స్టీవ్‌ సైమన్‌తో ఆమె వీడియో కాల్‌లో మాట్లాడింది. కానీ, పెంగ్‌పై ఒత్తిడి తీసుకువచ్చి అలా మాట్లాడించారనే విషయం అర్థమవుతుందని సైమన్‌ వ్యాఖ్యానించాడు. 

Advertisement
Advertisement