Abn logo
Aug 24 2021 @ 20:57PM

బీసీలను వేధిస్తున్న జగన్: శ్యామ్ చంద్రశేషు

అమరావతి: ఆదరణ పథకం కింద పనిముట్ల కోసం బీసీలు చెల్లించిన రూ.47కోట్లను తినేసిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం బీసీలను ఉద్ధరిస్తుందా? అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ చంద్రశేషు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదరణ పనిముట్లు, యంత్రాలు బీసీలకు ఇవ్వకుండా, వారు డీడీల రూపంలో తమ వాటాగా ఇచ్చిన సొమ్మును తిరిగివ్వకుండా సీఎం జగన్ వేధిస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు జగన్ ప్రభుత్వం రూ.67వేలకోట్లు ఖర్చు చేసిందని బీసీ మంత్రి చెప్పడం పచ్చి అబద్ధమన్నారు.


అమ్మఒడి, చేయూత, రైతుభరోసా, వసతి దీవెన కింద అన్నివర్గాలకు ఇచ్చినట్టే బీసీలకు ఇచ్చారని చెప్పారు. ప్రత్యేకంగా బీసీలకోసం, బీసీ కార్పొరేషన్లకు ఎన్ని నిధులు కేటాయించారో బీసీ మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.బీసీ సబ్ ప్లాన్ కింద బడ్జెట్‌లో ఎన్నినిధులు కేటాయించి, ఎన్ని వెచ్చించారో సమాధానం చెప్పగల ధైర్యం ప్రభుత్వంలో ఎవరికైనా ఉందా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో బీసీలంతా సంఘటితమై జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేసి చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేయడం ఖాయమని శ్యామ్ చంద్రశేషు అన్నారు.