Advertisement
Advertisement
Abn logo
Advertisement

Americaలో అదరగొడుతున్న ‘శ్యామ్ సింగరాయ్’.. మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లు..

ఎన్నారై డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా.. సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. క్లాసికల్ బ్లాక్‌బస్టర్‌గా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన ఈ మూవీ.. తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలోని 256 థియేటర్లలో విడుదలైంది. నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా అమెరికాలో ఇన్ని థియేటర్లలో రిలీజ్ కావడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే ‘శ్యామ్ సింగరాయ్’ రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. విడుదలైన మూడు రోజుల్లో కేవలం అమెరికాలోనే దాదాపు రూ.4కోట్లను రాబట్టింది. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను అమెరికాలో విడుదల చేసిన రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. 


ఇదిలా ఉంటే.. పునర్జన్మల కథాశంతో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా.. ద్విపాత్రాభినయంలో నేచురల్ స్టార్ అదరగొట్టాడు. ఎప్పటిలాగే సాయిపల్లవి తన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఫదా చేయగా.. కృతిశెట్టి సైతం యువతను అలరించింది. 



Advertisement

ఓవర్సీస్ సినిమామరిన్ని...

Advertisement