Abn logo
Oct 17 2020 @ 13:38PM

నాని నిర్మాతలు మారుతున్నారా?

Kaakateeya

నేచురల్‌ స్టార్‌ నాని 'టక్‌ జగదీష్‌' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో 'శ్యామ్‌ సింగరాయ్‌' చిత్రంలో నాని నటించాల్సి ఉంది. ఈ సినిమాను ముందుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ నిర్మిస్తున్నట్లు ప్రకటన కూడా వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఏమైందో ఏమో కానీ..  'శ్యామ్‌ సింగరాయ్‌' ప్రాజెక్ట్‌ నుండి సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ తప్పుకుందట. వారి స్థానంలో మరో నిర్మాత సినిమాను నిర్మించడానికి రెడీ అయినట్లు కూడా సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మరి ఈ వార్తలపై నాని కానీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కానీ ఏదైనా ప్రకటన చేస్తుందో చూడాలి. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్‌ నటించనున్నారు. వారిలో ఇప్పటికే సాయిపల్లవి ఓకే అయినట్లు కూడా టాక్‌ వినిపిస్తోంది మరి. 


Advertisement
Advertisement
Advertisement