ఎస్‌ఐ, ఏఎస్‌ఐ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-04-16T06:05:29+05:30 IST

ముమ్మిడివరం ఎస్‌ఐ కేవీ నాగార్జున, ఏఎస్‌ఐ జి.జమిందార్‌(జమి)పై సస్పెన్షన్‌ వేటు పడింది. సంక్రాంతి సందర్భంగా ముమ్మిడివరం నగర పంచాయతీ రాజుపాలెంలో పేకాట శిబిరంపై దాడి చేసి రూ.6.50 లక్షలు స్వాధీనం చేసుకుని కేసు మాఫీ చేయడంపై పత్రికల్లో వార్తలు వచ్చాయి.

ఎస్‌ఐ, ఏఎస్‌ఐ సస్పెన్షన్‌

ముమ్మిడివరం, ఏప్రిల్‌ 15: ముమ్మిడివరం ఎస్‌ఐ కేవీ నాగార్జున, ఏఎస్‌ఐ జి.జమిందార్‌(జమి)పై సస్పెన్షన్‌ వేటు పడింది. సంక్రాంతి సందర్భంగా ముమ్మిడివరం నగర పంచాయతీ రాజుపాలెంలో పేకాట శిబిరంపై దాడి చేసి రూ.6.50 లక్షలు స్వాధీనం చేసుకుని కేసు మాఫీ చేయడంపై పత్రికల్లో వార్తలు వచ్చాయి. అలాగే ఈ అంశం సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అయింది. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దాడిలో పట్టుబడిన వారు ఎస్‌ఐ, ఏఎస్‌ఐకు అనుకూలంగానే చెప్పినా మరింత లోతుగా విచారణ చేయడంతో వారిద్దరి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీంతో సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ కేసులో హోంగార్డు రాధాకృష్ణను పెద్దాపురం బదిలీ చేసిన విషయం తెలిసిందే..

Updated Date - 2021-04-16T06:05:29+05:30 IST