ఎస్‌ఐ పరీక్ష ప్రశాంతం

ABN , First Publish Date - 2022-08-08T04:29:27+05:30 IST

ఎస్‌ఐ(పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌) రాత పరీక్ష మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పోలీస్‌ బందోబస్తు నడుమ పరీక్ష నిర్వహించారు.

ఎస్‌ఐ పరీక్ష ప్రశాంతం
ఎన్‌టీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రం వద్ద రూమ్‌ నంబర్లు చూసుకుంటున్న అభ్యర్థులు

7,617 మంది హాజరు.. 517 మంది గైర్హాజరు

కేంద్రాల వద్ద భారీ బందోబస్తు 

కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ వెంకటేశ్వర్లు


మహబూబ్‌నగర్‌, ఆగస్టు 7: ఎస్‌ఐ(పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌) రాత పరీక్ష మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పోలీస్‌ బందోబస్తు నడుమ పరీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలో 15 సెంటర్లలో నిర్వహించిన పరీక్షకు 7,6 17 మంది హాజరు కాగా, 517 మంది గైర్హాజరయ్యారు. 10 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, అభ్యర్థులు 8:30 గం టలకే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. తొమ్మిది గంటలకు కేంద్రాల లోపలికి అనుమతించారు. బయోమెట్రిక్‌ విధా నం ద్వారా అభ్యర్థుల వేలిముద్రలు సేకరించి, హాల్‌ టికెట్‌లను పరిశీలిం చారు. ఆ తర్వాత లోపలికి అనుమ తించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని పోలీ సులు ముందుగానే హెచ్చరించడంతో ఆలస్యంగా కేంద్రాల వద్దకు చేరుకున్న అభ్యర్థులు ఉరుకులు, పరుగులతో వచ్చారు. ఎలక్ర్టానిక్‌ వస్తువులు, వాచ్‌ లు, క్యాలిక్లేటర్‌లను అనుమతించలేదు. కేంద్రాలను ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు, అడిషనల్‌ ఎస్పీ రాములు పరిశీలించారు. కేంద్రాల వద్ద గల జిరా క్స్‌ సెంటర్లు, ఇంటర్నెట్‌ సెంటర్లను మూయించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించి, ఇతరులను పరిస రాల్లోకి అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్ష సజావుగా సాగ డంతో పోలీసులు ఊపిరి పీల్చు కున్నారు. జిల్లాలో 275 మంది పోలీ స్‌లు బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ, అడిషనల్‌ ఎస్పీ, డీఎస్పీ మహేశ్‌లు బందోబస్తును పర్యవేక్షించారు. 


పారదర్శకంగా పరీక్ష: ఎస్పీ

జిల్లాలో అత్యంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించామని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. కేంద్రాల వద్ద ఇ బ్బందులు లేకుండా చూసుకున్నామని, అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రా లకు చేరుకున్నారని చెప్పారు. పటిష్ట పోలీస్‌ బందోబస్తు మధ్య పరీక్ష నిర్వహించామన్నారు. 144 సెక్షన్‌ అమలు చేశామన్నారు. అభ్యర్థులు సమయానికి కేంద్రాల వద్దకు చేరుకు నేలా ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా చర్యలు చూశామన్నారు. అభ్యర్థులు తమ సామర్థ్యం నమ్ముకోవాలే తప్ప పైరవీ కారులు, దళారులను నమ్మి మోస పోవద్దని అన్నారు. అలాంటి వారి సమాచారం పోలీసులకు అందిం చాలని కోరారు.





Updated Date - 2022-08-08T04:29:27+05:30 IST