సూర్యాపేట: సివిల్ వివాదంలో చిక్కుకున్న ఎస్ఐ

ABN , First Publish Date - 2020-09-24T15:59:42+05:30 IST

మేళ్ల చెరువు ఎస్ఐ రవీందర్ ఓ సివిల్ వివాదంలో చిక్కుకున్నారు.

సూర్యాపేట: సివిల్ వివాదంలో చిక్కుకున్న ఎస్ఐ

సూర్యాపేట: మేళ్ల చెరువు ఎస్ఐ రవీందర్ ఓ సివిల్ వివాదంలో చిక్కుకున్నారు. మేళ్లచెరువు మండలం రేవూరులో ఓ భూ వివాదానికి సంబంధించి ఎస్ఐ తనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులు పెట్టారని ఆంజనేయులు అనే వ్యక్తి మనస్థాపం చెంది పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకి ఎస్ఐ రవీందర్, ఓ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-09-24T15:59:42+05:30 IST