SI దారుణ హత్య

ABN , First Publish Date - 2021-11-22T16:39:07+05:30 IST

మేకల దొంగలను పట్టుకునేందుకు మోటారు బైకుపై వెళ్ళిన ప్రత్యేక ఎస్‌ఐ ఆ దొంగల చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఎస్‌ఐ హంతకులను పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక పోలీసు బృందాలు

SI దారుణ హత్య

పుదుకోట వద్ద దారుణం

హంతకుల కోసం

8 ప్రత్యేక బృందాలతో గాలింపు

సీఎం స్టాలిన్‌ దిగ్ర్భాంతి


చెన్నై: మేకల దొంగలను పట్టుకునేందుకు మోటారు బైకుపై వెళ్ళిన ప్రత్యేక ఎస్‌ఐ ఆ దొంగల చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఎస్‌ఐ హంతకులను పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఎస్‌ఐ హత్యపట్ల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్రదిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తూ ప్రకటన జారీ చేశారు. ఎస్‌ఐ కుటుంబీకులకు కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. తిరుచ్చి జిల్లా తిరువెరుంబూరు సమీపం చోళమానగర్‌ ప్రాంతానికి చెందిన భూమినాథన్‌ (51) నవాల్‌పట్టు పోలీసు స్టేషన్‌లో ప్రత్యేక ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. శనివారం అర్థరాత్రి భూమినాథన్‌ ఓ బైకులో, హెడ్‌కానిస్టేబుల్‌ చిత్తిరైవేల్‌ మరో మోటారు సైకిల్‌లో గస్తీకి వెళ్ళారు. చిన్నచురియూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ చోట అనుమానాస్ప దంగా కొందరు సంచరిస్తూ కనిపించారు. అదే సమయం లో మేకల అరుపులు కూడా వినిపించా యి. వెంటనే ఎస్‌ఐ భూమినాథన్‌, హెడ్‌కానిస్టేబుల్‌ చిత్తిరైవేల్‌ తమ వాహనాలను నిలిపివేసి మేకల అరుపులు వినిపించిన ప్రాంతానికి నడిచివెళ్ళినప్పుడు రెండు మోటారు బైకుల్లో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మేకలను పట్లుకుని వెళుతుం డటం కనిపించింది. పోలీసులను చూడగానే ఆ దొంగలు బైకుల వేగాన్ని పెంచటంతో ఎస్‌ఐ భూమినాఽథన్‌, హెడ్‌కానిస్టేబుల్‌ చిత్తిరైవేల్‌ కూడా బైకుల్లో వారిని వెంబడించారు. తొలుత హెడ్‌కానిస్టేబుల్‌ చిత్తిరైవేల్‌ మేకల దొంగలను వెంబడించి వారిని పట్టుకోలేక ఆగిపో యాడు. అయితే ఎస్‌ఐ భూమినాథన్‌ పట్టువిడవకుండా వారిని వేగంగా వెంబడించారు. చివరకు ఆ దొంగలు తిరుచ్చి జిల్లా దాటి, పుదుకోట జిల్లా సరిహద్దులోని కీరనూరు కలమావూరు రైల్వేగేట్‌ దాటుకుని వెళ్లగా పల్లత్తుపట్టి వద్ద ఎస్‌ భూమినాధన్‌ బైకులో వేగంగా వెళ్ళి వారిని అడ్డుకున్నారు. మోటారు బైకుల్లో మేకలతో ఉన్నవారి వద్ద  భూమినాథన్‌ విచారణ జరుపుతూ తనకు సాయపడేందుకుగాను నావలూరు స్టేషన్‌లో తనతోపాటు పనిచేస్తున్న మరో ఎస్‌ఐ శేఖర్‌కు ఫోన్‌చేసి వెంటనే ఆ ప్రాంతానికి రమ్మని కబురుపెట్టాడు. దీనితో మేకల దొంగలు పోలీసులకు చిక్కిపోవటం ఖాయమని అనుమానించి తమ వెంట తెచ్చుకున్న వేటకొడవళ్లతో ఎస్‌ఐ భూమినాథన్‌పై దాడి జరిపి మెరుపువేగంతో పారిపోయారు.


ఆయన వద్దనున్న వాకీటాకీని, సెల్‌ఫోన్‌ను రోడ్డు పక్కనే ఉన్న ఓ గోతిలో పడేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భూమినాథన్‌ ఆ స్థలంలోనే మృతి చెందారు. ఆ లోపున అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ శేఖర్‌ రోడ్డుపై వంటి నిండా కత్తిపోటు గాయాలతో శవంగా పడివున్న భూమినాథన్‌ చూసి దిగ్ర్భాంతి చెందారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.  పుదుకోట డీఎస్పీ  నిషా పార్తీబన్‌, ఇతర పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలన జరిపారు. ఆ తర్వాత స్పెషల్‌ ఎస్‌ఐ భూమినాఽథన్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కీరనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. తిరుచ్చి నుండి పుదుకోట జిల్లా కీరనూరు రహదారి వరకూ ఉన్న సీసీటీవీ కెమెరాలలో నమోదైన వీడియో దృశ్యాల ఆధా రంగా హంతకుల ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎస్‌ఐని హత్యచేసిన మేకల దొంగలు పుదుకోట జిల్లాకు చెందినవారని నిర్ధారణ కావటంతో వారిని పట్టుకునేందుకు తిరుచ్చి సర్కిల్‌లో నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు, పుదుకోట సర్కిల్‌లో నాలుగు ప్రత్యేక బృందాలు చొప్పున మొత్తం ఎనిమిది పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇప్పటికే పాత నేరస్థులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని కీరనూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు.


స్టాలిన్‌ సంతాపం

మేకల దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించిన తిరుచ్చి నవల్‌పట్టు ప్రత్యేక ఎస్‌ఐ దారుణహత్యకు గురైనట్టు తెలుసుకుని తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. ఎస్‌ఐ హత్యతో శోకతప్తులైన ఆయన కుటుంబీకులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఎస్‌ఐ భూమినాథన్‌ కుటుంబీకులకు తక్షణ సాయం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కోటి రూపాయల ను అందజేయనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఎస్‌ఐ కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించనున్నట్టు స్టాలిన్‌ ప్రకటించారు.


తిరుచ్చి డీఐజీ నివాళి

తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం కోసం సిద్ధం చేసిన ఎస్‌ఐ భూమినాఽథన్‌ భౌతికకాయంపై పుష్పగుచ్చాలు ఉంచి డీఐజీ శరవణ సుందర్‌ ఇతర పోలీసు ఉన్నతాధికారులు, సహోద్యోగులు నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా డీఐజీ శరవణ సుందర్‌ మీడియాతో మాట్లాడుతూ హత్యకు గురైన ఎస్‌ఐ భూమినాథన్‌ కుటుంబీకులకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కోటి రూపాయలను తక్షణ సాయంగంగా ప్రకటించి నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఎస్‌ఐ హంతకులకు సంబంధించిన కీలకమైన సమా చారం లభించిందని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు తరలివెళ్ళాయని ఆయన చెప్పారు.


అనాథాశ్రమాలకు సాయం

హత్యకు గురైన ప్రత్యేక ఎస్‌ఐ భూమినాథన్‌ తన సంపాదనలో కొంత భాగాన్ని ప్రతినెలా అనాథాశ్రమా లకు విరాళంగా ఇచ్చేవారని సహోద్యోగులు తెలిపారు. 1995 వ బ్యాచ్‌కు చెందిన ఆయన పలు పోలీసు స్టేషన్లలో పనిచేసి నిజాయితీపరుడిగా, నిరాడం బరుడిగా పేరుగడించారు. ఎప్పుడూ మోటారు బైకుపై ప్రయాణిస్తూ స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేవారని చెప్పారు. భూమినాఽథన్‌కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు అన్నా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడని తెలిపారు.

Updated Date - 2021-11-22T16:39:07+05:30 IST