బెయిల్ కోసం సిద్ధార్థ్ దరఖాస్తు
ABN , First Publish Date - 2021-06-12T07:29:08+05:30 IST
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో
ముంబై, జూన్ 11: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన రాజ్‌పుత్ సహచరుడు సిద్థార్థ్ పితాని.. బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఈనెల 26న తన వివాహం జరగా ల్సి ఉందని, కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ముంబైలోని ఎన్డీపీఎస్ కోర్టులో ఆయన దరఖాస్తు చేశారు. పితాని బెయిల్ దరఖాస్తుపై ఈనెల 16 లోపు సమాధానం ఇవ్వాలని నాక్రోటిక్స్ కంట్రోల్ బ్యూరో ను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 16కు వాయి దా వేసింది.