నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సిద్దిపేట కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-10-26T22:11:49+05:30 IST

తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి అసత్యాలను ప్రచారం చేశారని జిల్లా

నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సిద్దిపేట  కలెక్టర్‌

సిద్దిపేట: జిల్లాలో వరి విత్తనాల అమ్మకంపై తాను చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి అసత్యాలను ప్రచారం చేశారని జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. నిన్న జరిగిన అగ్రికల్చర్ మీటింగ్‌లో తాను మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలపై కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి స్పందించారు. సోషల్‌ మీడియాలో తన వ్యాఖ్యలను ఉద్దేశ్యపూర్వకంగా మార్చారని కలెక్టర్‌ పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని డీలర్లను కోరామని ఆయన తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పామని కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. 


 


సోమవారం జరిగిన అగ్రికల్చర్ మీటింగ్‌లో అధికారులకు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఒకవేళ ఎవరైనా వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఒక్కొక్కరిని చెండాడుతా, వేటాడుతా.. అంటూ హెచ్చరించారు. వరి విత్తనాలు అమ్మే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, విత్తన సరఫరా చేసే డీలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


Updated Date - 2021-10-26T22:11:49+05:30 IST