Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాసిరకం విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు: ముజమ్మిల్ ఖాన్

సిద్ధిపేట: జిల్లాలో ఈసారి నాలుగు లక్షల ఎకరాల్లో రైతులు వానాకాలం పంట సాగు చేయబోతున్నారని జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి మాట్లాడుతూ ప్రధానంగా వరి, పత్తి సాగు ఎక్కువగా ఉంటుందన్నారు. జిల్లాలో 427 ఫర్టిలైజర్ షాపులున్నాయని... వాటన్నింటిపైనా నిఘా పెట్టామని తెలిపారు. నాసి రకం విత్తనాలు విక్రయిస్తే షాప్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. విత్తన విక్రయదారులు తాత్కాలిక స్వలాభం కోసం భవిషత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. నాసిరకం విత్తనాల ఆట కట్టించడానికి రెవెన్యూ, పోలీస్, అగ్రికల్చర్ అధికారులతో ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు ప్రభుత్వం సూచించిన బ్రాన్డ్ విత్తనాలనే తీసుకోవాలని ముజమ్మిల్ ఖాన్ సూచించారు.

Advertisement
Advertisement