Abn logo
Aug 30 2021 @ 14:11PM

Siddipet: మల్లారం వాగు, శనిగరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన కలెక్టర్

సిద్దిపేట: జిల్లాలో భారీ వర్షాల కారణంగా  చిన్న కోడూరు మండలం మల్లారంలో పొంగిపొర్లుతున్న మల్లారం వాగు, శనిగరం ప్రాజెక్ట్‌ను కలెక్టర్ వెంకట్రామ రెడ్డి పరిశీలించారు. అలాగే  మల్లారం గ్రామంలోని హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సివరేజి బోర్డ్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌లో నీట మునిగిన పంప్ హౌజ్‌ను పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా వర్షపు నీటిని ఎత్తిపోసి హైదారాబాద్‌కు సాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సివరేజి బోర్డ్ జనరల్ మేనేజర్ బ్రిజేష్‌కు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో వచ్చే రెండు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.