Siddipet: అక్కన్నపేటలో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-05T12:45:44+05:30 IST

అక్కన్నపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. గుడాటిపల్లి గ్రామ పరిధిలోని సోమాజితండాలో భూక్య లక్ష్మీ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితురాలు ప్రాజెక్ట్

Siddipet: అక్కన్నపేటలో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

సిద్దిపేట: అక్కన్నపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. గుడాటిపల్లి గ్రామ పరిధిలోని సోమాజితండాలో భూక్య లక్ష్మీ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితురాలు ప్రాజెక్ట్ నిర్మాణంలో నష్టపోయింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో తన భూమికి పరిహారం అందలేదని మనస్థాపానికి గురై మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-05T12:45:44+05:30 IST