Advertisement
Advertisement
Abn logo
Advertisement

నర్సింహులు కుటుంబాన్ని ఆదుకుంటాం: ఆర్డీఓ అనంత రెడ్డి

సిద్దిపేట: చిట్టాపూర్ బావి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన గజ ఈతగాడు నర్సింహులు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని సిద్దిపేట ఆర్డీఓ అనంత రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తరiపున రావాల్సిన అన్ని బెనిఫిట్స్‌ను అందిస్తామన్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సహకారం కింద రూ. 6 లక్షల పరిహారం అందే అవకాశం ఉంటుందన్నారు. దీనితో పాటు బాధిత కుటుంబానికి తక్షణం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయిస్తామని అనంత రెడ్డి తెలిపారు.


పూర్తి వివరాలు

పెద్దనిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన ఆకుల ప్రశాంత్‌ (25), ఆయన తల్లి భాగ్యలక్ష్మి (55) బుధవారం మధ్యాహ్నం కారులో హుస్నాబాద్‌కు బయల్దేరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌ గ్రామ సమీపంలోని కూడవెళ్లి చిన్నవాగు బ్రిడ్జి వద్దకు వెళ్లేసరికి.. ఒక్కసారిగా టైర్‌ పేలడంతో కారు బ్రిడ్జి కిందికి దూసుకెళ్లింది. వాగు పక్కనే బ్రిడ్జి కింద ఉన్న వ్యవసాయ బావిలో పడింది. అక్కడున్న రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, అధికారులు కారును వెలికితీసే ప్రయత్నం మొదలుపెట్టారు. సహాయక చర్యల కోసం వచ్చిన గజ ఈతగాళ్లలో ఒకరు నర్సింహులు కారును బావిలోంచి తీయడానికి ఉపయోగించిన తాడు బిగుసుకోవడంతో బావిలోనే మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. నర్సింహులు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని సిద్దిపేట ఆర్డీఓ అనంత రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement