గన్ మిస్‌ఫైర్...హైదరాబాద్ యువకుడు మృతి

ABN , First Publish Date - 2021-11-04T14:29:56+05:30 IST

గన్ మిస్‌ ఫైర్ అవడంతో హైదరాబాద్‌కు చెందిన ముస్లీం యువకుడు మృతి చెందాడు. జిల్లాలోని మద్దూర్ మండలం సలాక్ పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గన్ మిస్‌ఫైర్...హైదరాబాద్ యువకుడు మృతి

సిద్దిపేట: గన్ మిస్‌ ఫైర్ అవడంతో హైదరాబాద్‌కు చెందిన ముస్లీం యువకుడు మృతి చెందాడు. జిల్లాలోని మద్దూర్ మండలం సలాక్ పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సలాక్ పూర్ గ్రామంలో ఫజిల్ ఇంటికి ఎనిమిది మంది స్నేహితులు హైదరాబాద్ నుంచి వచ్చారు. విందు చేసుకొనే క్రమంలో షికారుకు చెందిన గన్‌తో ఫైర్ చేయడంతో అది మిస ఫైర్ అయి ముసాఫ్(20) తలకు బలంగా తగిలింది. వెంటనే సలాక్‌పూర్ నుండి సిద్దిపేటకు ఆస్పత్రికి తీసుకొని వెళ్తుండగా మార్గ మధ్యలోనే ముసాఫ్ మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2021-11-04T14:29:56+05:30 IST