సిద్దిపేటకు వాలీబాల్‌ అకాడమీ

ABN , First Publish Date - 2021-04-14T05:32:50+05:30 IST

సిద్దిపేటలో వాలీబాల్‌ అకాడమీ, స్పోర్ట్స్‌ హాస్టల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట క్రీడాహబ్‌ కాబోతున్నదని వెల్లడించారు. ఇటీవల 6వ అంతర్‌ జిల్లాల వాలీబాల్‌ ఛాంపియన్‌షి్‌ప పోటీలు సిద్దిపేటలో విజయవంతమయ్యాయని గుర్తు చేశారు. సిద్దిపేటలో వాలీబాల్‌ క్రీడకు ఆధరణ ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నారు.

సిద్దిపేటకు వాలీబాల్‌ అకాడమీ

స్పోర్స్ట్‌ హాస్టల్‌కు రూ. 2 కోట్ల నిధులు మంజూరు

హర్షం వ్యక్తం చేస్తున్న యువత, క్రీడాకారులు


సిద్దిపేట సిటీ, ఏప్రిల్‌ 13 : సిద్దిపేటలో వాలీబాల్‌ అకాడమీ, స్పోర్ట్స్‌ హాస్టల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట క్రీడాహబ్‌ కాబోతున్నదని వెల్లడించారు. ఇటీవల 6వ అంతర్‌ జిల్లాల వాలీబాల్‌ ఛాంపియన్‌షి్‌ప పోటీలు సిద్దిపేటలో విజయవంతమయ్యాయని గుర్తు చేశారు. సిద్దిపేటలో వాలీబాల్‌ క్రీడకు ఆధరణ ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన శిక్షణా తరగతుల్లో ఇద్దరు క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంపికవడం ఇందుకు నిదర్శనమన్నారు. వాలీబాల్‌ క్రీడాకారులను ప్రోత్సాహించే ఉద్దేశంతో సిద్దిపేటలో వాలీబాల్‌ అకాడమీ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అకాడమీ ఏర్పాటుతో సిద్దిపేటలోనే శిక్షణ తరగతులు జరుగుతాయని చెప్పారు.


రూ. 2 కోట్లతో స్పోర్ట్స్‌ హాస్టల్‌

సిద్దిపేట క్రీడా అభిమానులకు మంత్రి హరీశ్‌రావు తీపి కబురు అందించారు. రూ. 2 కోట్లతో స్పోర్ట్స్‌ హాస్టల్‌ నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులతో హస్టల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. సిద్దిపేటలో వాలీబాల్‌ స్టేడియానికి కొత్త హంగులు సమకూరనున్నాయి. క్రీడా అభిమానులు వాలీబాల్‌ పోటీలను తిలకించేందుకు వీలుగా పెవిలియన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి చెప్పారు. పోటీలకు వచ్చే క్రీడాకారుల కోసం డ్రెసింగ్‌ రూమ్‌లు, టాయ్‌లెట్లు, ఇతర వసతులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. సిద్దిపేటలో వాలీబాల్‌ అకాడమీ, స్పోర్ట్స్‌ హాస్టల్‌ ఏర్పాటుపై క్రీడాకారులు, యువత హర్షం వ్యక్తం చేశారు. వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాల సాయిరాం, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి,  సిద్దిపేట క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మల్లిఖార్జున్‌, బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహేష్‌, స్టేడియం నిర్వాహకులు రాజు, బజ్జి, మహేష్‌ తదితరులు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-04-14T05:32:50+05:30 IST