సిద్దూయే PCC అధ్యక్షుడు.. అధికారికంగా ప్రకటించిన అధిష్ఠానం

ABN , First Publish Date - 2021-07-19T03:35:23+05:30 IST

ఎవరు ఎంత అసంతృప్తి వ్యక్తం చేసినా, కాంగ్రెస్ అధిష్ఠానం సిద్దూవైపే మొగ్గు చూపింది. పీసీసీ అధ్యక్షుడిగా

సిద్దూయే PCC అధ్యక్షుడు.. అధికారికంగా ప్రకటించిన అధిష్ఠానం

న్యూఢిల్లీ : ఎవరు ఎంత అసంతృప్తి వ్యక్తం చేసినా, కాంగ్రెస్ అధిష్ఠానం సిద్దూవైపే మొగ్గు చూపింది. పీసీసీ అధ్యక్షుడిగా సిద్దూను నియమిస్తూ అధిష్ఠానం అధికారికంగా ఓ లేఖను విడుదల చేసింది. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరిట ఈ లేఖ విడుదలైంది. ఈ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. సిద్దూను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ మరో నలుగుర్ని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది అధిష్ఠానం. సంగత్ సింగ్ గిల్జియన్, సుఖ్వీందర్ సింగ్ డానీ, పవన్ గోయల్, ఖుల్జీత్ సింగ్ నగ్రా... ఈ నలుగుర్నీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దూను అడ్డుకునేందుకు సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆయన వర్గీయులు చివరి వరకూ చాలా ప్రయత్నాలు చేశారు. అయినా అధిష్ఠానం మాత్రం సిద్దూకే పీసీసీ పగ్గాలు అప్పజెప్పడం విశేషం. 



Updated Date - 2021-07-19T03:35:23+05:30 IST