రైల్వేలో అతిపెద్ద ఈఐఎల్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ

ABN , First Publish Date - 2020-07-14T09:01:44+05:30 IST

దక్షిణ మధ్య రైల్వేలోనే అతి పెద్ద ఎలకా్ట్రనిక్‌ ఇంటర్‌లాకింగ్‌(ఈఐఎల్‌) సిగ్నలింగ్‌ వ్యవస్థను

రైల్వేలో అతిపెద్ద ఈఐఎల్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ

  • గుత్తి స్టేషన్‌లో ఏర్పాటు.. రైళ్ల నిర్వహణ సులభం

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వేలోనే అతి పెద్ద ఎలకా్ట్రనిక్‌ ఇంటర్‌లాకింగ్‌(ఈఐఎల్‌) సిగ్నలింగ్‌ వ్యవస్థను గుంతకల్లు డివిజన్‌లోని గుత్తి స్టేషన్‌ యార్డు వద్ద ఈ నెల 12 న ప్రారంభమైంది. తమ పరిధిలో ఇది నాలుగో అతి పెద్ద ఇంటర్‌లాకింగ్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థగా దక్షిణ మధ్య రైల్వో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌, విజయవాడ, కాజీపేట స్టేషన్ల వద్ద ఇలాంటి వ్యవస్థలున్నప్పటికీ... ఇవి ఎలకా్ట్రనిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థలు కావని తెలిపింది. గుత్తి స్టేషన్‌ యార్డు పునర్నిర్మాణ పనుల్లో భాగంగా దీనిని ఏర్పాటు చేశామని, దక్షిణ మధ్య రైల్వేలోనే ఇది 343 రూట్లతో లింక్‌ చేస్తూ ఏర్పాటు చేసిన ఎలకా్ట్రనిక్‌ ఇంటర్‌లాకింగ్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ అని వివరించింది.   

Updated Date - 2020-07-14T09:01:44+05:30 IST