ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ ఉంటే Sikkimలో విదేశీ పర్యాటకులకు ప్రవేశ అనుమతి

ABN , First Publish Date - 2021-12-08T18:41:04+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో పర్యాటక ప్రాంతమైన సిక్కింలో ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు ఉన్న విదేశీ పర్యాటకులను అనుమతిస్తూ ఉత్తర్వులు...

ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ ఉంటే Sikkimలో విదేశీ పర్యాటకులకు ప్రవేశ అనుమతి

గ్యాంగ్‌టక్ (సిక్కిం): కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో పర్యాటక ప్రాంతమైన సిక్కింలో ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు ఉన్న విదేశీ పర్యాటకులను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ వ్యాప్తి వల్ల గత ఏడాది మార్చి నెల నుంచి సిక్కింలో విదేశీ పౌరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ సిక్కిం సర్కారు ఆదేశాలిచ్చింది. కరోనా వైరస్ సిక్కింలో 32,382 మందికి సోకగా, 405 మంది మరణించారు.సిక్కిం విదేశీ పౌరుల ప్రవేశంపై నిషేధాన్ని పాక్షికంగా సడలించింది. రాష్ట్రంలోకి విదేశీ పర్యాటకులు ప్రవేశించాలంటే ఆర్టీపీసీఆర్ ప్రతికూల నివేదికను తీసుకురావడాన్ని తప్పనిసరి చేసింది.సిక్కింకు తూర్పున నేపాల్, భూటాన్, చైనాలతో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. 


‘‘నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌తో సహా ఇప్పటికే 10 రోజులకు పైగా భారతదేశంలో ఉన్న, సిక్కింకు ప్రయాణిస్తున్న విదేశీయులందరూ రాష్ట్రంలోకి ప్రవేశించడానికి అనుమతించనున్నారు. వారు ప్రవేశించిన 72 గంటల్లోపు ప్రతికూల ఆర్టీపీసీఆర్ పరీక్ష నివేదికను సమర్పించాలి’’ అని సిక్కిం ప్రధాన కార్యదర్శి ఎస్సీ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.గ్యాంగ్‌టక్‌లో డిసెంబర్ 10న ప్రారంభం కావాల్సిన నాలుగు రోజుల సిక్కిం గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇప్పటికే రద్దు చేశారు.మంగళవారం 8 కొత్త కొవిడ్ -19 కేసులు వెలుగుచూశాయి.కేంద్ర ప్రభుత్వం ఒమైక్రాన్ వైరస్ వ్యాపించిన యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్‌లతో సహా యూరోపియన్ దేశాలను ప్రమాదకర దేశాలుగా గుర్తించింది. 


Updated Date - 2021-12-08T18:41:04+05:30 IST