మౌనం పిరికితనంతో సమానం: జస్టిస్ ఎన్వీ రమణ

ABN , First Publish Date - 2021-04-05T01:14:17+05:30 IST

అన్యాయానికి వ్యతిరేకంగా విద్యార్ధులు గళం విప్పాలని న్యాయ విద్యార్థులకు జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. మౌనం పిరికితనంతో సమానమని వ్యాఖ్యానించారు.

మౌనం పిరికితనంతో సమానం: జస్టిస్ ఎన్వీ రమణ

ఢిల్లీ: అన్యాయానికి వ్యతిరేకంగా విద్యార్ధులు గళం విప్పాలని న్యాయ విద్యార్థులకు జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. మౌనం పిరికితనంతో సమానమని వ్యాఖ్యానించారు. దామోదరం సంజీవయ్య లా యూనవర్సిటీ కాన్వాకేషన్ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శక, అవినీతి రహిత పాలనకు దివంగత మాజీ సీఎం సంజీవయ్య నిదర్శనమని కొనియాడారు. నేటి రాజకీయ నాయకులను ఆయనతో పోల్చడం కష్టమన్నారు. నూతన పంథాలో నిర్మాణాత్మకంగా విద్యార్ధులు ఆలోచించాలని సూచించారు. మూస విద్యా పద్ధతులకు స్వస్తి చెప్పాలని హితవుపలికారు. జాతి నిర్మాణంలో టీచర్లు, విద్యా సంస్థల పాత్ర ఎంతో ఉందని చెప్పారు. విద్య అంతిమ లక్ష్యం ప్రజాప్రయోజనం కావాలని జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు.

Updated Date - 2021-04-05T01:14:17+05:30 IST