Abn logo
Jun 11 2021 @ 23:50PM

రాంపూర్‌ దుర్గమ్మ ఆలయంలో వెండి కిరీటం చోరీ

 కొల్చారం, జూన్‌ 11: మండలంలోని రాంపూర్‌లో గురువారం అర్ధరాత్రి  దొంగలు గ్రామ శివారులోని దుర్గమ్మ ఆలయం తలుపులు పగలగొట్టి వెండి కిరీటంతో పాటు హుండీలో ఉన్న నగదును దొంగలించారు. అనంతరం గ్రామంలో ఐదు ఇళ్ల తాళాలను బద్దలు కొట్టి బీరువాలను ధ్వంసం చేశారు. కాగా ఆ ఇళ్లలో విలువైన వస్తువులు లేనట్టు తెలిసింది. ఉదయం ఎస్‌ఐ శ్రీనివా్‌సగౌడ్‌ గ్రామానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Advertisement