కంచి నుంచి వెండి పూజా సామగ్రి

ABN , First Publish Date - 2020-08-05T07:22:21+05:30 IST

అయోధ్య రామాలయ భూమి పూజకు శంకర మఠం నుంచి వెండి పూజా సామగ్రిని పంపినట్లు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర

కంచి నుంచి వెండి పూజా సామగ్రి

  • కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి వెల్లడి

చెన్నై, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): అయోధ్య రామాలయ భూమి పూజకు శంకర మఠం నుంచి వెండి పూజా సామగ్రిని పంపినట్లు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పేర్కొన్నారు. 1986లో  జయేంద్ర సరస్వతి అయోధ్య వెళ్లి పూజల్లో పాల్గొన్నారని తెలిపారు. 1989 జూలై 29న కంచి మఠం నుంచి భూమి పూజ కోసం ఇటుకలు పంపించామన్నారు. రాజీవ్‌గాంధీ, పీవీ ప్రధానులుగా ఉన్న కాలం నుంచే ప్రారంభమైన రామమందిరం నిర్మాణం ఎట్టకేలకు ప్రస్తుతం ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సహకారంతో బుధవారం భూమి పూజ జరగడం దైవ నిర్ణయంగా భావిస్తున్నట్లు తెలిపారు. అయోధ్య, తమిళనాడుల మధ్య పలు దగ్గర సంబంధాలున్నాయని చెప్పారు. కంచి మఠం నుంచి పూజల్లో ఉంచిన మట్టి, పూజా సామగ్రి, బంగారు, వెండి నాణేలు, పట్టువస్త్రాలు, రామకోటి రాసిన వెండి పళ్లెం తదితరాలను విమానం ద్వారా అయోధ్యకు పంపించామని, రామ మందిరం శంకుస్థాపన రోజైన ఆగస్టు 5.. జయేంద్ర సరస్వతి స్వామి అవతరించిన రోజు కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2020-08-05T07:22:21+05:30 IST