14 వరకు అప్పన్న దర్శనం లేదు

ABN , First Publish Date - 2020-04-01T10:16:28+05:30 IST

సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి ఏప్రిల్‌ 14వ తేదీ వరకు భక్తులను అనుమతించబోమని దేవస్థానం ఈఓ మారెళ్ల వెంకటేశ్వరరావు తెలిపారు.

14 వరకు  అప్పన్న దర్శనం లేదు

నిషేధాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ఈవో

వార్షిక కల్యాణం నాటి రథోత్సవం కూడా రద్దు


సింహాచలం, మార్చి 31: సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి ఏప్రిల్‌ 14వ తేదీ వరకు భక్తులను అనుమతించబోమని దేవస్థానం ఈఓ మారెళ్ల వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తొలుత మార్చి 31 వరకు దర్శనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజా ఉత్తర్వుల ప్రకారం నిషేధాన్ని ఏప్రిల్‌ 14 వరకు పొడిగించినట్టు ఈవో ప్రకటించారు.


అయితే నిత్యం స్వామి వారికి జరగాల్సిన వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ఏకాంతంలో వైదికులు నిర్వహిస్తారని తెలిపారు. కాగా ఏటా చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి నాడు స్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించే రథోత్సవాన్ని రద్దు చేసినట్టు ఈవో తెలిపారు. అలాగే దొంగలదోపు, వినోదోత్సవం కూడా రద్దు చేసినట్టు తెలిపారు. అయితే ఈనెల నాలుగో తేదీన ఆలయ కల్యాణ మండపంలో ఏకాంత సేవగా కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్టు తెలిపారు.  

Updated Date - 2020-04-01T10:16:28+05:30 IST