Abn logo
Sep 21 2021 @ 01:05AM

సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

వ్యాక్సిన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

పెంబి, సెప్టెంబరు 20 : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథి గా అజ్మీరా రేఖానాయక్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అధికారులు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సర్వసభ్య సమావేశానికి కొంత మంది అధికారులు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీఒక్కరూ వ్యాక్సిన్‌ తప్పకుండా వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పుప్పాల శంకర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సల్ల నరేందర్‌రెడ్డి, ఎంపీపీ కవిత గోవింద్‌, వైస్‌ ఎంపీపీ గంగారెడ్డి, సర్పంచ్‌ శేఖర్‌గౌడ్‌, వైద్యులు, నాయకులు మహేందర్‌, గాండ్ల శంకర్‌, రాజేందర్‌, తదితరులు ఉన్నారు.  అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న కొవిడ్‌వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్‌ పరిశీలించారు.