Advertisement

No Way Home: ఆ విషయంలో బాధగా ఉందంటున్న మార్వెల్ హీరో

‘అవెంజర్స్’.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాల గురించి తెలియని మూవీ లవర్ లేదంటే అతిశయోక్తి కాదు. మార్వెల్ కామిక్ యూనివర్స్ పేరుతో మార్వెల్ సినిమాస్ క్రియేట్ చేసిన ఓ మూవీ ప్రపంచమే ఈ సిరీస్ సినిమాలు. ఇందులో ఎంతో మంది సూపర్ హీరోస్ కలిసి భూమికి, యూనివర్స్‌కి ప్రమాదకరంగా మారిన విలన్‌ల పనిపడుతుంటారు. అందుకే ఈ సినిమాలకి వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.


మార్వెల్ నుంచి వస్తున్న కొత్త మూవీ ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ ట్రైలర్‌ విడుదలైతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. ఎందుకంటే ఇందులో ప్రస్తుత స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హోలండ్‌తో పాటు.. గతంలో ఈ పాత్రను పోషించిన ఆండ్రూ గార్ఫీల్డ్, టోబే మాగైర్ కూడా ఉన్నారని వార్తలు రావడం. 


కాగా, విడుదలై మంచి విజయం సాధించిన మార్వెల్ మూవీ ‘షాంగ్ చీ: ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’. ఈ సిరీస్‌లో వచ్చిన ఈ మూవీతో తొలి ఆసియన్ సూపర్ హీరోగా పరిచయమయ్యాడు ‘సిమూ లియూ’. తాజాగా ఈ నటుడు మార్వెల్ నుంచి రాబోయే కొత్త సినిమా ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


దీని గురించి ఆ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లో.. ‘ చిన్నప్పుడు గ్రేటర్ టొరంటోతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎవరి పుట్టినరోజు పార్టీ జరిగిన స్పైడర్ మ్యాన్ వేషం వేసేవాడిని. కానీ నేను ‘నో వే హోమ్‌’ సినిమాలో ఉన్నట్లు ఎవరూ మాట్లాడుకోకపోవడం కొంచెం బాధగా ఉంద’ని రాసుకొచ్చాడు.


అయితే ‘షాంగ్ ఛీ’తో మంచి విజయాన్ని అందుకున్న ఈ నటుడు త్వరలోనే మరో మార్వెల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమాలలో ఎటువంటి విలన్లతో పోరాటం సాగించి.. భూమిని ప్రమాదం నుంచి కాపాడతాడో చూద్దాం..

Advertisement

Bollywoodమరిన్ని...