ఏకకాలంలో రుణమాఫీ చేయాలి : బీజేపీ

ABN , First Publish Date - 2021-07-30T05:57:40+05:30 IST

రైతుల రుణమాఫీని ఏకకాలంలో చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలికంటి వీరేంద్ర డిమాండ్‌ చేశారు. పార్టీ

ఏకకాలంలో రుణమాఫీ చేయాలి : బీజేపీ
సూర్యాపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు

సూర్యాపేటరూరల్‌/ మద్దిరాల, జూలై 29: రైతుల రుణమాఫీని ఏకకాలంలో చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలికంటి వీరేంద్ర డిమాండ్‌ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో రైతుబంధు డబ్బులను కూడా బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకుంటున్నారని ఆరోపిం చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలుచేసి పంట నష్టపోయిన రైతులను అదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జీజేపీ జిల్లా ఉపాఽధ్యక్షుడు రాపర్తి శ్రీనివాస్‌గౌడ్‌, గజ్జల వెంకట్‌రెడ్డి, మీర్‌ అక్బర్‌, వల్దాస్‌ ఉపేందర్‌, పణీనాయుడు, రాజు, విజయ్‌, పాల్గొన్నారు. మద్దిరాల తహసీ ల్దార్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు భూతం సాగర్‌, విక్రమ్‌, ఆచారి, నరేష్‌, వెంకట్‌నారాయణ పాల్గొన్నారు. 

గరిడేపల్లి రూరల్‌: ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి షేక్‌ యాకుబ్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని కీతవారిగూడెంలో గురువారం నిర్వహించిన పార్టీ సమావేశంలో మా ట్లాడారు. రుణమాఫీ చేయకుండా రైతులకు ఉన్న సబ్సిడీలను ఎత్తివేస్తున్నారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని వారిని మోసం చేశారన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసమే దళితులకు రూ.10లక్షలు ఇస్తానని మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తమ్ముల సైదయ్య, మాజీసర్పంచ్‌ రాచమల్ల రామస్వామి, జుట్టుకొండ వెంకటేశ్వర్లు, దోసపాటి భిక్షం, వెంకటాచారి, శ్రీనివాస్‌, వెంకటయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-30T05:57:40+05:30 IST