తెలుగుజాతికి ఆదర్శప్రాయుడు సినారె

ABN , First Publish Date - 2022-07-25T04:52:12+05:30 IST

జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సింగిరెడ్డి నారాయణరెడ్డి(సినారె) తెలుగుజాతి ఆదర్శప్రాయులు, ఆయన సేవలు స్ఫూర్తియని, తెలుగు ప్రజలందరికీ ఆయనంటే ఎనలేని గౌరవమని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి అన్నారు.

తెలుగుజాతికి ఆదర్శప్రాయుడు సినారె
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

ఊర్కొండ, జూలై 24: జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సింగిరెడ్డి నారాయణరెడ్డి(సినారె) తెలుగుజాతి ఆదర్శప్రాయులు, ఆయన సేవలు స్ఫూర్తియని, తెలుగు ప్రజలందరికీ ఆయనంటే ఎనలేని గౌరవమని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో మహాకవి సినారె కళాపీఠం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు చెందిన పలువురు కవులను, రచయితలను, సంగీత, నాట్యకళా మండలి రాష్ట్ర తొలి ఛైర్మన్‌ నందిని సిద్దారెడ్డితో కలిసి ఎమ్మెల్యే సన్మానించారు. ఉమ్మడి జిల్లా తరపున ఎన్నికైన జిల్లా కేంద్రానికి చెందిన కవి, గురుకుల ఉపాధ్యాయుడు పుట్టి గిరిధర్‌కు అందజేశారు. అనంతరం సీఎమ్మార్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాకవి డాక్టర్‌ సి.నారాయణరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉందామని పేర్కొన్నారు. ఎంపీపీ రాధ, జడ్పీటీసీ శాంతకుమారి, మండల కో-ఆప్షన్‌ కలిమ్‌పాషా, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కొమ్ము రాజయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వీరారెడ్డి, నాయకులు గిరినాయక్‌ వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, వివిధ జిల్లాలకు చెందిన కవులు తదితరులున్నారు.


Updated Date - 2022-07-25T04:52:12+05:30 IST