సింధు ఆట గాడిలో పడేనా?

ABN , First Publish Date - 2021-10-26T08:08:38+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత గతవారం డెన్మార్క్‌ ఓపెన్‌ బరిలో దిగిన భారత స్టార్‌ పీవీ సింధు క్వార్టర్‌ఫైనల్లో ఓడిపోయింది......

సింధు ఆట గాడిలో పడేనా?

నేటినుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత గతవారం డెన్మార్క్‌ ఓపెన్‌ బరిలో దిగిన భారత స్టార్‌ పీవీ సింధు క్వార్టర్‌ఫైనల్లో ఓడిపోయింది. ఈనేపథ్యంలో మంగళవారం నుంచి జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని స్టార్‌ షట్లర్‌ పట్టుదలగా ఉంది. ఆరంభ మ్యాచ్‌లో జూలీ డవల్‌ జాకోబ్సన్‌ (డెన్మార్క్‌)తో ఒలింపిక్‌ పతక విజేత సింధు తలపడనుంది. తదుపరి రౌండ్‌లలో డెన్మార్క్‌కే చెందిన లినె క్రిస్టొఫర్‌సెన్‌, థాయ్‌ షట్లర్‌ బుసానన్‌ ఓంగ్‌బాంరుంగ్‌పన్‌ లేదా స్కాట్లాండ్‌ క్రీడాకారిణి క్రిస్టీ గిల్మోర్‌తో ఆమె ఆడాల్సి ఉంటుంది. ఇక లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా సయాక టకషిట (జపాన్‌)తో టోర్నీని ఆరంభించనుంది. పురుషుల సింగిల్స్‌లో సమీర్‌వర్మ మొదటి రౌండ్‌లో ఆరోసీడ్‌ జొనాథన్‌ క్రిస్టీని, కిడాంబి శ్రీకాంత్‌ వరల్డ్‌ నెం.1 కెంటొ మొమోటోను ఢీకొననున్నారు. ఇక సాయిప్రణీత్‌-లక్ష్యసేన్‌ను, ప్రణయ్‌-చౌ టిన్‌ చెన్‌ను, సౌరభ్‌ వర్మ-ఆంథోని సిన్‌సుకను, కశ్య్‌ప-బ్రైస్‌ లెవర్డెజ్‌ను ఎదుర్కొంటారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌/చిరాగ్‌, అర్జున్‌/ఽధ్రువ్‌, మను/సుమీత్‌రెడ్డి బరిలో దిగుతున్నారు. మహిళల డబుల్స్‌లో అశ్విని/సిక్కిరెడ్డి, మేఘన/పూర్వీషా, మిక్స్‌డ్‌లో సాత్విక్‌/అశ్విని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

Updated Date - 2021-10-26T08:08:38+05:30 IST