CM YS Jagan ఆశీర్వాదంతోనే పతకం నెగ్గా: సింధు

ABN , First Publish Date - 2021-08-06T18:14:41+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పీవీ సింధు కలిశారు. సచివాలయంలో సీఎం ఛాంబర్‌లో సింధు కలిసింది. టోక్యో ఒలింపిక్స్‌‌లో గెలుచుకున్న కాంస్య పతకాన్ని సీఎంకు చూపించారు.

CM YS Jagan ఆశీర్వాదంతోనే పతకం నెగ్గా: సింధు

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పీవీ సింధు కలిశారు. సచివాలయంలో సీఎం ఛాంబర్‌లో సింధు కలిసింది. టోక్యో ఒలింపిక్స్‌‌లో గెలుచుకున్న కాంస్య పతకాన్ని సీఎంకు చూపించారు. సింధును ఆయన సత్కరించారు. మీ ఆశీర్వాదంతోనే పతకాన్ని నెగ్గానని జగన్‌కు సింధు తెలిపింది. దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని సీఎం కొనియాడారు. విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారుకావాలని జగన్ ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదు బహుమానాన్ని అధికారులు అందించారు. నేడు కేబినెట్‌ భేటీలో చర్చించన అనంతరం సింధుకు రూ.30 లక్షల నగదు బహుమతిని ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. కాగా.. నేడు సిందు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.







Updated Date - 2021-08-06T18:14:41+05:30 IST