Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారతీయులకు సింగపూర్ గుడ్‌న్యూస్.. ఈ నెల 29 నుంచి..

ఎన్నారై డెస్క్: ఇండియాకు సింగపూర్ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌ను వ్యాక్సినేటెడ్ ట్రావెల్ లేన్(వీటీల్) ప్రోగ్రామ్ జాబితాలో చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నవంబర్ 29 తర్వాత భారత ప్రయాణికులకు ఇబ్బందులు తొలగుతాయని వెల్లడించింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యావత్ ప్రపంచ లాక్‌డౌన్ అయిన విషయం తెలిసిందే. అయితే మహమ్మారి ఉధృతి కాస్త తగ్గిన తర్వాత చాలా దేశాలు.. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రయాణికులపై సింగపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆంక్షలను ఎత్తేసేందుకు భారత ప్రభుత్వం సింగపూర్‌తో చాలా రోజులుగా చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేటెడ్ ట్రావెల్ లేన్ ప్రోగ్రామ్‌ జాబితాలోకి భారత్‌ను చేర్చింది. ఇందులో భాగంగా నవంబర్ 29 నుంచి గుర్తింపు పొందిన వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో తీసుకున్న భారత ప్రయాణికులు ఇకపై క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది. కాగా. సింగపూర్ మంత్రి మాట్లాడుతూ.. చెన్నై, ఢిల్లీ, ముంబై నగరాలకు ప్రతి రోజు రెండు వీటీఎల్ విమానాలను నడిపేందుకు చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. చర్చలు ముగిసిన తర్వాత సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ సింగపూర్ (సీఏఏఎస్) దీనిపై మరింత సమాచారాన్ని వెల్లడిస్తుందని మంత్రి పేర్కొన్నారు. Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement