భారత్‌కు సింగపూర్ గుడ్‌న్యూస్!

ABN , First Publish Date - 2021-10-24T03:58:31+05:30 IST

కరోనా ఆంక్షల జాబితాల నుంచి భారత్‌ను తొలగిస్తున్నట్టు సింగపూర్ తాజాగా ప్రకటించింది. భారత్‌తో పాటూ మరో ఐదు దక్షిణాసియా దేశాలకు ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది.

భారత్‌కు సింగపూర్ గుడ్‌న్యూస్!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా ఆంక్షల జాబితాల నుంచి భారత్‌ను తొలగిస్తున్నట్టు సింగపూర్ తాజాగా ప్రకటించింది. భారత్‌తో పాటూ మరో ఐదు దక్షిణాసియా దేశాలకు ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది. భారత్, బంగ్లాదేశ్, మియాన్మార్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకలో ప్రయాణించిన వారందరినీ తమ దేశంలోకి అనుమతిస్తామని, అంతేకాకుండా..సింగపూర్ గుండా మరో గమ్యానికి వెళ్లేందుకు కూడా అనుమతి ఉందని అక్కడి ప్రభుత్వం తాజాగా పేర్కొంది. అయితే.. ఆయా దేశాల పర్యటకులు మాత్రం సింగపూర్‌లోకి అడుగుపెట్టాక 10 రోజుల పాటు ఇంటిపట్టునే గడపాల్సి ఉంటుంది. ఈ నిబంధన అనుల్లంఘనీయం. ఇక శుక్రవారం నాటి లెక్కల ప్రకారం సింగపూర్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,65,663కి చేరుకుంది. ఇప్పటివరకూ అక్కడ 294 మంది కరోనాకు బలయ్యారు. 

Updated Date - 2021-10-24T03:58:31+05:30 IST