సింగపూర్ కార్మికుల‌ హాస్టళ్లపై కరోనా పంజా.. ఇవాళ ఒక్కరోజే..

ABN , First Publish Date - 2020-07-02T20:14:04+05:30 IST

సింగపూర్‌లో విదేశీ కార్మికులు అత్యధికంగా నివసించే డార్మిటరీలపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ..

సింగపూర్ కార్మికుల‌ హాస్టళ్లపై కరోనా పంజా.. ఇవాళ ఒక్కరోజే..

సింగపూర్: సింగపూర్‌లో విదేశీ కార్మికులు అత్యధికంగా నివసించే డార్మిటరీలపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ 188 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో అత్యధికులు ఈ వసతి గృహాల నుంచే ఉన్నారని అధికారులు వెల్లడించారు. కొత్త కేసులతో కలిపి సింగపూర్‌లో మొత్తం కొవిడ్-19 బాధితుల సంఖ్య 44,310కి పెరిగింది. కొత్తగా గుర్తించిన కేసుల్లో పది వరకు సామాజిక వ్యాప్తి ద్వారా వచ్చినవేననీ.. ఇందులో ఎనిమిది మంది సింగపూర్ వాసులు ఉండగా..  మరో ఇద్దరు విదేశీయులు ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇవాళ నమోదైన 188 కేసుల్లో 178 మంది వరకు డార్మిటరీల్లో నివసిస్తున్న విదేశీయులే ఉన్నట్టు తెలిపింది. ఇప్పటి వరకు 39,011 మంది కరోనా నుంచి కోలుకోగా 26 మంది చనిపోయారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారికి 5 లక్షల మందికి పైగా బలికాగా.. కోటి మందికి పైగా ఇన్ఫెక్షన్ సోకింది. 

Updated Date - 2020-07-02T20:14:04+05:30 IST