సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2021-08-21T17:36:52+05:30 IST

సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ.. సింగపూర్ తెలుగు సమాజం సామాజికసేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుంటుందన్న విషయం తెలిసిందే. ఈ స్వచ్ఛంద సంస్థ.. రెడ్ క్రాస్ సొసైటీ స

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

సింగపూర్ సిటీ: సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ.. సింగపూర్ తెలుగు సమాజం సామాజికసేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుంటుందన్న విషయం తెలిసిందే. ఈ స్వచ్ఛంద సంస్థ.. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఆగష్టు 15 భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. కాగా ఎన్నో సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా విచ్చేసి రక్త దానం చేశారు. 



ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చినప్పటికీ కొవిడ్-19 సురక్షిత చర్యలలో భాగంగా ముందుగా నమోదు చేసుకొన్న 100 మందికి మాత్రమే అవకాశం కల్పించినట్టు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు. కరోనా వాక్సిన్ తీసుకున్న వారికి కాల పరిమితి నిబంధనలు ఉండటం వల్ల చాలామంది రక్తదానం చేయలేకపోయినట్టు చెప్పారు. కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన వారు తరువాత రోజుల్లో కూడా RO284 కోడ్‌ను ఉపయోగించి రక్తదానం చేయోచ్చని నిర్వాహకులు జూనెబోయిన అర్జునరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సింగపూర్ తెలుగు సమాజానికి, రెడ్ క్రాస్ మరియు బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి, కార్యదర్శి సత్య చీర్ల ధన్యవాదాలు తెలిజేశారు.


Updated Date - 2021-08-21T17:36:52+05:30 IST