నేటినుంచి సింగరేణిలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ

ABN , First Publish Date - 2021-01-20T04:18:55+05:30 IST

సింగరేణిలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఉచిత శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారం భం కానుంది.

నేటినుంచి సింగరేణిలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ
శిక్షణకు వచ్చిన వారు

రుద్రంపూర్‌ (సింగరేణి), జనవరి 19: సింగరేణిలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఉచిత శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారం భం కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను సింగరేణి యాజమాన్యం పూర్తిస్థాయిలో చేపట్టింది. సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశాల మేరకు సింగరేణి సేవా సమితి సహకా రంతో యాజమాన్యం అన్ని రకాల ఏర్పాట్లకు సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీ నుంచి 45 రోజులపాటు అన్ని ఏరియాల్లో కూ డా శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లను ఆయా ఏరియాలకు సంబంధించిన జనరల్‌ మేనే జర్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెం కార్పో రేట్‌, కొత్తగూడెం మైన్స్‌ ఏరియాకు సంబంధించిన కార్య క్రమాన్ని జనరల్‌ మేనేజర్లు సీహెచ్‌. నరసింహారావు, కె.బసవ య్య మంగళవారం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.... దేశ భద్రతలో తెలంగాణ యువత భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. విద్యావంతులైన నిరుద్యోగ యువత సింగరేణి అందిస్తున్న సహకారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశ భద్రత బలగాల్లో తెలంగాణ యువత తక్కువ మోతాదులో ఉండటం, కొంత బాధాకరమన్నారు. ఈ శిక్షణ శిబిరాల్లో ప్రస్తుతం పని చేస్తున్న సింగరేణి కార్మికులు, మాజీ కార్మికులు, ప్రాజెక్ట్‌ ప్రభావిత ప్రాంతాల యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని పిలుపునిచ్చారు. కొవిడ్‌ నేపథ్యంలో భోజన వసతి సౌకర్యాలను పూర్తిగా ఏర్పాటు చేయడంలేదన్నారు. శిక్షణ ప్రారంభమయ్యే ఉదయం పూటకు అవసరమయ్యే పాలు, గుడ్డు, అరటి పండ్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. కొత్తగూడెం ఏరియా కార్పోరేట్‌కు సంబంధించి రుద్రంపూర్‌ లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ కాలనీలో శిక్షణ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. సింగరేణి వ్యాప్తంగా ప్రతి ఏరియా నుంచి 250 మంది అభ్యర్థులు రావడానికి అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మైన్స్‌ ఏరియా జనరల్‌ మేనేజర్లు సీహెచ్‌. నరసింహారావు, కే. బసవయ్యతోపాటు డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు ధన్‌పాల్‌ శ్రీనివాస్‌ (పర్సనల్‌), శ్యాముల్‌ సుధాకర్‌, టి.సూర్యనారాయణ (సివిల్‌), రాజశేఖర్‌ (ఫైనాన్స్‌), సీనియర్‌ సెక్యూరిటీ ఆఫీసర్లు రమణా రెడ్డి (కొత్తగూడెం ఏరియా), వేణుమాధవ్‌ (కార్పోరేట్‌), డిప్యూ టీ పర్సనల్‌ మేనేజర్లు డి. కిరణ్‌బాబు, సీనియర్‌ పీవోలు బేతి రాజు, శ్రావణ్‌ కుమార్‌, అనిల్‌ కుమార్‌, సంతోష్‌, సందీప్‌, శ్రీ కాంత్‌, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్లు పాస్‌నెట్‌, సుందర్‌రాజు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-20T04:18:55+05:30 IST