యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించాలి

ABN , First Publish Date - 2021-03-02T05:21:45+05:30 IST

యంత్రాలను పూర్తిస్థాయిలో వినిగించినప్పుడే ఉత్పత్తి లక్ష్యాల సాధన సులభమవుతుందని సింగరేణి డైరక్టర్లు (ఫైనాన్స్‌) బలరాం, (పా) చంద్రశేఖర్‌, ఈఅండ్‌ఎం సత్యనారాయణ తెలిపారు.

యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించాలి
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న డైరక్టర్‌

అప్పుడే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధన సులభం

సింగరేణి డైరక్టర్లు బలరాం, చంద్రశేఖర్‌, సత్యనారాయణ

మణుగూరు, మార్చి 1: యంత్రాలను పూర్తిస్థాయిలో వినిగించినప్పుడే ఉత్పత్తి లక్ష్యాల సాధన సులభమవుతుందని సింగరేణి డైరక్టర్లు (ఫైనాన్స్‌) బలరాం, (పా) చంద్రశేఖర్‌, ఈఅండ్‌ఎం సత్యనారాయణ తెలిపారు. సోమవారం మణుగూరు ఏరియాలో పర్యటించిన డైరక్టర్లు యంత్రాల వినియోగంపై స్ధానిక అధికారులకు అవగాహన కల్పించారు. ఓసీ గనుల్లో ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే భారీ యంత్రాలు ఒక్క గంట బ్రేక్‌ డౌన్‌ అయినా వాటిల్లే ఆర్ధిక నష్టం వివరించారు. భారీ యంత్రాల వాహానాల మరమ్మతులు సకాలంలో చేసుకుంటూ బొగ్గుఎగుమతులు పెంచేందుకు సమిష్టి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ సందర్భంగా జీఎం ఎంఎస్‌, జీఎం క్యూఎం,జీఎం సేఫ్టీ, పికె ఓసీ పివో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం మణుగూరు ఏరిలో ఉత్పత్తి లక్ష్యసాధనలో కీలక పాత్ర పోషిస్తూ ప్రతిభ కనబర్చిన ఉధ్యోగులు ఎష్‌ సాంబశిరావు, మదాసి శ్రీనివాస్‌, కెఎం జగదీష్‌, కె బాబులాల్‌, నర్సింహారావులను డైరక్టర్లు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.

Updated Date - 2021-03-02T05:21:45+05:30 IST