సింగరేణిని అమ్మేస్తారా?

ABN , First Publish Date - 2021-12-10T00:10:05+05:30 IST

సింగరేణి ఇప్పటివరకూ నష్టాల్లో ఉండటం చూడలేదు. మొత్తం దేశంలోనే లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో..

సింగరేణిని అమ్మేస్తారా?

హైదరాబాద్: సింగరేణి ఇప్పటివరకూ నష్టాల్లో ఉండటం చూడలేదు. మొత్తం దేశంలోనే లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో లాభాల్లో నడుస్తోంది. ప్రతి సంవత్సరం ఉద్యోగులకు బోనస్‌లు ప్రకటిస్తోంది. సంస్థకు వచ్చే లాభాల్లో కూడా వాటా ఇస్తోంది. ఇప్పటివరకూ కేంద్రప్రభుత్వం చాలా సంస్థలను ప్రైవేటీకరణ చేసింది. చాలా సంస్థలను అమ్మేసింది. నష్టాల్లో ఉన్న సంస్థలను, నష్టాల్లో ఉన్న కంపెనీలను భరించలేమంటూ కేంద్రప్రభుత్వం కారణం చెబుతూ వచ్చింది. ఈ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి కాబట్టి ప్రైవేటీకరణ చేస్తున్నామంటూ చెప్పుకొచ్చింది. ప్రైవేటీకరణ చేస్తే ఆ సంస్థలు లాభాల్లోకి వస్తాయని చెబుతూ వచ్చాయి. ఇలాంటి కారణాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో చెప్పాయి.


కానీ సింగరేణి లాభాల్లో ఉంది. లాభాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రతి ఏటా కూడా లాభాలు పెరుగుతూ వస్తున్నాయి. అలాంటి సింగరేణికి సంబంధించిన మైన్స్‌ను ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన కేంద్రం ప్రస్తుతం చేస్తోంది. కేంద్రం అటువంటి ఆలోచన చేయడం పట్ల కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అటువంటి ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి నాలుగు బ్లాక్‌లను పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన కేంద్రం చేయడం పట్ల రాష్ట కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అటువంటి ఆలోచనను విరమించుకోవాలని సీఎం లేఖలో పేర్కొన్నారు. 


ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ‘‘దేశానికి వెలుగులు పంచే సింగరేణిని అమ్మేస్తారా?. 4 గనుల ప్రైవేటీకరణ నిర్ణయం సబబేనా?. కేంద్ర చెబుతున్నంటి?, కార్మికుల వాదనేంటి?’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ ఎడిషన్‌ డిబేట్ నిర్వహించింది. ఈ వీడియోను చూడగలరు..




Updated Date - 2021-12-10T00:10:05+05:30 IST