Jun 2 2021 @ 23:00PM

దేవయాన్‌... శ్రేయా ఘోషల్‌ సన్‌!

గాయని శ్రేయా ఘోషల్‌, షీలాదిత్యా ముఖోపాధ్యాయ దంపతులకు మే 22న మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. కుమారుడికి ‘దేవయాన్‌ ముఖోపాధ్యాయ’గా నామకరణం చేసినట్టు బుధవారం శ్రేయా ఘోషల్‌ సామాజిక మాధ్యమాల్లో తెలియజేశారు. ‘‘మే 22న భూమ్మీదకు వచ్చిన దేవయాన్‌ మా జీవితాలను శాశ్వతంగా మార్చాడు. అతడు జన్మించినప్పటి నుంచి మా హృదయాలు ప్రేమతో నిండిపోయాయి. కేవలం తల్లితండ్రులు మాత్రమే బిడ్డ జన్మలో స్వచ్ఛమైన ప్రేమానుభూతి చెందుతారు’’ అని శ్రేయా ఘోషల్‌ పేర్కొన్నారు. కుమారుడితో శ్రేయ-షీలాదిత్య దంపతులిద్దరూ దిగిన ఫొటోనూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అయితే, అందులో దేవయాన్‌ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.