విపక్షాల ఐక్య శక్తి చాటుదాం... బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో రాహుల్

ABN , First Publish Date - 2021-08-03T16:38:21+05:30 IST

విపక్షాలన్నీ ఏక తాటిపైకి వచ్చి బలమైన శక్తిగా నిలబడటం చాలా కీలకమని కాంగ్రెస్ పార్టీ...

విపక్షాల ఐక్య శక్తి చాటుదాం... బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో రాహుల్

న్యూఢిల్లీ: విపక్షాలన్నీ ఏక తాటిపైకి వచ్చి బలమైన శక్తిగా నిలబడటం చాలా కీలకమని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. విపక్ష పార్టీల లోక్‌సభ, రాజ్యసభ ఫోర్ల్ లీడర్లతో కన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో రాహుల్ మంగళవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ మీట్ ఏర్పాటు చేశారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో విపక్షాలు ఐక్యశక్తిగా నిలవాలని రాహుల్ ఈ సందర్భంగా కోరారు. విపక్షాలన్నీ ఏకతాటిగా బలమైన శక్తిగా నిలిచినప్పుడే ప్రజావాణిని సమర్ధవంతంగా వినిపించగలుగుతామని అన్నారు. అలా కాని పక్షంలో బీజేపీ-ఆర్‌ఎఎస్ఎస్‌ను ఎదుర్కోవడం, ప్రజావాణిని అణిచివేయకుండా వారిని నిలువరించడం కష్టమవుతుందని అన్నారు. విపక్ష నేతలతో రాహుల్ ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీట్‌‌లో కాంగ్రెస్‌తో పాటు, ఎన్‌సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్‌పీ, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, రివల్యూషనరీ పార్టీ (ఆర్ఎస్‌పీ), కేరళ కాంగ్రెస్, జార్ఖాండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ, లోక్‌తాంత్రిక్ జనతాదళ్ (ఎల్‌జేడీ) నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T16:38:21+05:30 IST